NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభ్యసనా అభివృద్ధికి క్షేత్ర పర్యటనలు అవసరం: హెచ్‌ఎం మహేశ్వర్ రెడ్డి

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: అభ్యసనా అభివృద్ధికి క్షేత్ర పర్యటనలు విద్యార్థులకు అవసరమని  హెచ్ ఎం మహేశ్వర్ రెడ్డి అన్నారు.ప్యాపిలి పట్టణంలోని కిందిగేరి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యార్థులకు క్షేత్ర పర్యటన నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు కలచట్ల సమీపంలోని విండ్ పవర్ ప్రాజెక్ట్, బేతాపల్లి వద్ద ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్ట్, కలచట్లలోని పట్టుపురుగుల పెంపక కేంద్రం, అలాగే ప్యాపిలి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లను సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పుస్తకాలలో నేర్చుకున్న అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందుతుందని, అనుభవాల ద్వారా పొందిన అభ్యసనం శాశ్వతంగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి క్షేత్ర పర్యటనలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరినాథ్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులకు వివిధ ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *