NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  మద్దికేర మండలం పెరవలి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) ఆధ్వర్యంలో రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ కే.ఈ. శ్యామ్ కుమార్  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ ను అందించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ నూతన ఉపకేంద్రం ద్వారా పెరవలి, బసినేపల్లి, రామాపురం, రామాపురం కొట్టాల, మదనతపురం గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందనుంది. దీంతో తక్కువ వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యలు తగ్గి, ముఖ్యంగా వ్యవసాయ మోటార్లకు నిరంతరాయంగా విద్యుత్ అందడంతో రైతులు సకాలంలో సాగునీరు అందించి పంటలను మెరుగ్గా సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.5 MVA సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ 33/11 కేవీ ఉపకేంద్రం భవిష్యత్తు విద్యుత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్మించబడిందని, ఈ ప్రాంత ప్రజలకు మరియు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.”రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం” అని పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీ కే.ఈ. శ్యామ్ కుమార్ గారు, విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను ప్రతి గ్రామానికి అందిస్తూ పత్తికొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *