NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆదేశాల ప్రకారం “2 ఏళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా రెండో రోజు హొళగుంద పట్టణంలోని 41వ బూత్ పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శక పాలన ద్వారా సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో 41వ బూత్ ఇన్‌చార్జి ఆర్. అభిషేక్, కో-యూనిట్ కోనేరు భాస్కర్, సీనియర్ నాయకులు బుడగజంగల్ రామాంజి, కొండ బుడాన్న, యువ నాయకుడు కోనేరు మహేష్, ఉరుకుంద నాగప్పతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలకు మంచి ఆదరణ చూపుతూ, రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించినట్లు నాయకులు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *