NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటికి పెద్ద బిడ్డలా పెన్షన్ అందించి ఆదుకుంటున్న వ్యక్తి సియం చంద్రబాబు

1 min read

– ఎమ్మెల్యే షాజహాన్ బాషా కితాబు

మదనపల్లె ,  న్యూస్ నేడు : కూటమి ప్రభుత్వం  ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్ధిదారుల ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్న ఘనత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు దేనని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా పేర్కొన్నారు.శనివారం మదనపల్లె గ్రామీణ మండలం  కొత్త ఇండ్లు పంచాయతీ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి స్వయం గా  పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచి పోతారన్నారు.అవ్వ తాతలకు పెన్షన్ నగదుతో ఆర్థిక భద్రత ను అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వా నిదేనన్నారు.  ఆదరణ కరువైన అభాగ్యులకు, నిరుపేదలకు వృద్ధులకు పెన్షన్లు అందించి ఆదు కుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్ మస్రూర్, సచివాలయ సిబ్బంది, తెలుగు దేశం నాయకులు తాళ్ల గిరి, పతి, దొరస్వామి నాయుడు, శివలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *