ప్రజల ఆశీర్వాదమే మా బలం – డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ చేపట్టిన “డోర్ టు డోర్” కార్యక్రమంలో భాగంగా ప్యాపిలి మండలం చంద్రపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, “ప్రజల ఆశీర్వాదమే మా బలం” అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రజలకు మరింత చేరువవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.మొదటిసారిగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టడం, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.7,000 ఆర్థిక సాయం అందించడం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో చంద్రపల్లి గ్రామ నాయకులు పాల రామకృష్ణ, బోయ వెంకటరాముడు, బాలరెడ్డి రమణ, శేఖర్, రామయ్య, నరేష్, సందీప్, బెస్త చంద్ర, డీలర్ సుంకన్న, పాల జయరాములు, హరిజన శ్రీరాములు, కొండన్న, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.


