ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు
1 min read
నీటి నిలువలు , భూగర్భ జలాలు పెంచే చర్యలు చేపట్టండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ మనోహర్ ను ఆదేశించారు. కేంద్ర జల్జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ కమల్ కిషోర్ ఢిల్లీ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ మనోహర్ ను జిల్లాలోని అన్ని నీటి వనరుల యొక్క నీటిని వర్షాలు పడక ముందు మరియు వర్షాలు పడిన తర్వాత నీటిని సేకరించి వాటికి పరీక్షలు నిర్వహించాలని అందులో ఉన్న రసాయనాలను గుర్తించాలని , ఆ నీటిని ప్రజలు వినియోగించే విధంగా అవసరమైన మార్పులు చేసి ప్రజలకు అందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండటానికి పారిశ్రామిక వాడలకు దగ్గరగా ఉన్న నీటిని , డంపింగ్ యార్డ్ దగ్గర నీటిని , చెరువులు , చెక్ డ్యాముల నీటిని , బోరు బావుల నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.ప్రస్తుతము వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని , ఇతర శాఖలను సమన్వయం చేసుకొని రైన్ వాటర్ హార్ వెస్టింగ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేయటం , చెక్ డ్యామ్ లు ఏర్పాటు , ఫారం పాండ్స్ ఏర్పాటు ,విబిజి రాంజీ పనుల ద్వారా నీటి నిలువలు గణనీయంగా పెరిగేలాగా చర్యలు తీసుకొని భూగర్భ జలాలు కూడా పెంచేలాగా చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ మనోహర్ ను ఆదేశించారు.


