NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెద్దహ్యటలో ఘనంగా శ్రీ కొల్లాపూరమ్మ, శ్రీ బంగారమ్మల కుంభోత్సవం

1 min read

ప్రత్యేక పూజలు, కుంభాల ఊరేగింపు, భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు మహామంగళ నైవేద్యాలు – సమృద్ధిగా వర్షాలు, పాడిపంటలు పండాలని భక్తుల ప్రార్థనలు

హొళగుంద, న్యూస్ నేడు: హొళగుంద మండల పరిధిలోని పెద్దహ్యట గ్రామంలో శ్రీ కొల్లాపూరమ్మ, శ్రీ బంగారమ్మల కుంభోత్సవం మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం భక్తులు అమ్మవార్లకు గంగిపూజ నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కుంభాలను గ్రామ వీధుల గుండా భక్తి గీతాలు, బీరప్ప డోళ్ల నాదాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయాలకు చేరవేశారు.అమ్మవార్లకు అభిషేకాలు, మహామంగళ నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. గ్రామ మహిళలు సంప్రదాయ పిండివంటలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. గ్రామ ప్రజలంతా కలిసి భక్తి భావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా భక్తులు సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవార్లను ప్రార్థించారు.ఈ కుంభోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *