ఉలిందకొండ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
1 min read
రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి – జిల్లా ఎస్పీ
సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయండి .
ఉలిండకొండ, న్యూస్ నేడు: ఉలిందకొండ పోలీసు స్టేషన్ ను కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మంగళవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఆరా తీశారు.డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలన్నారు.ప్రాపర్టీ కేసులను చేధించి రికవరీలు చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ చేయాలన్నారు. బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. సైబర్ నేరాలపై, మహిళల పై జరిగే నేరాల గురించి, మహిళల రక్షణ చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీ తో పాటు కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ ఎస్సై నిరంజన్ రెడ్డి ఉన్నారు.


