పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
1 min read
వికసిత భారత్–గ్రామ్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (VHD Plantation) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి
వీ బీ జీ రామ్ జీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
నంద్యాల, న్యూస్ నేడు : వీ బీ జీ రామ్ జీ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు..మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి నుంచి VHD ప్లాంటేషన్, VB – RAMG కార్యక్రమంపై అమలపై ఎంపీడీవోలు, పీడి డ్వామా, విద్యాశాఖ అధికారులు, ఎ పి డి , ఎ పి ఓ ల తో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ అభివృద్ధి జీవనోపాధి మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హరితాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు జిల్లాలో విస్తృతంగా మొక్కలు నాటడం, బీ జీ రామ్ జీకార్యక్రమాన్ని పటిష్టంగా అమలు అయ్యేలా చూడాలన్నారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. జీ రామ్ జీ పథకం కింద వేతన కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, కూలి చెల్లింపులను సకాలంలో అందించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 100 వేతన కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి పని దినాలను పెంచి వారి జీవనోపాధికి తోడ్పడాలని తెలిపారు. జిల్లాలో కింద చేపట్టిన పనులను అన్ని సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, రహదారుల వెంట, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెరువుల పరిసర ప్రాంతాలు మరియు ఇతర అనువైన ప్రదేశాల్లో స్థానిక వాతావరణానికి అనుకూలమైన మొక్కలను నాటాలని తెలిపారు. వీ బీ రామ్ జీ పథకం కింద ఉద్యాన తోటల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.ప్రతి గ్రామపంచాయతీలో ప్రజల భాగస్వామ్యంతో మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాలన్నారు. ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లు వీ బీ రామ్ జీ పథకం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


