లింగంపల్లిలో కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాల ప్రచారానికి అపూర్వ స్పందన
1 min read
ఈబీజీ గోవింద్ గౌడ్‌కు గ్రామ ప్రజల ఘన స్వాగతం – వర్షాన్ని లెక్కచేయకుండా ఇంటింటికీ చేరిన కూటమి నాయకులు
హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు హొళగుంద మండలంలోని లింగంపల్లి గ్రామంలో “ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో అడుగుపెట్టిన ఈబీజీ గోవింద్ గౌడ్‌కు గ్రామ ప్రజలు, మహిళలు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు 59, 60 బూత్‌ల పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వర్షం కురుస్తున్నప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.4,000 సామాజిక పింఛన్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అన్న క్యాంటీన్లు, రైతు సంక్షేమ పథకాలు, విద్యా రంగ అభివృద్ధి, మెరుగైన వైద్య సేవలు, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ, ప్రతి ఇంటితో ప్రత్యక్ష అనుబంధాన్ని ఏర్పరుచుకుంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కూటమి నాయకులు ప్రజలతో మమేకమవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి లింగంపల్లి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.కార్యక్రమంలో పాల్గొన్నవారుటీడీపీ సీనియర్ నాయకులు యారిస్వామి, దీడి వెంకటేష్, జనసేన మండల కన్వీనర్ అశోక్, బీజేపీ మండల కన్వీనర్ ప్రసాద్, టీడీపీ కో-కన్వీనర్ జకీర్, హుస్సేన్ పీరా, రామాంజి, దీడి నాగప్ప, దీడి మల్లయ్య, యువ నాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్, టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షుడు ముల్లా మొయిన్, పంచగుండిగ వెంకటేష్, సురేష్, టీడీపీ యువ నాయకుడు భీమా, ముకన్న, లింగప్ప, పాకిరప్ప, సిద్ధా, శేషగిరి, రామయ్య, భాస్కర్, కుమారి, గుండప్ప, గోవిందప్ప, పవన్, కానయ్య, జనసేన నాయకుడు వెంకటేష్, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



