NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీరా పరిశ్రమ కొరకు 1000కోట్ల రూ. నిధులు కేటాయించాలి

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు: గొల్లపూడిలోని బీసీ భవన్ లో రాష్ట్ర గౌడ వెల్ఫర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి,జిఎం భీమ శంకర్ అధ్యక్షతన డైరెక్టర్ల తో సమావేశం నిర్వహించారు.నీరా పరిశ్రమ కొరకు తాడి బోర్డు ను ఏర్పాటు చేసి 1000కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి. విద్యార్థి,విద్యార్థినులకు విదేశీ విద్య అమలు చేయాలి.గౌడ కుటుంబాలకు కల్లు గీత వృత్తి లేని సమయంలో గౌడ కుటుంబాలకు నెలకు 20,000 రూ.అందించాలి.గౌడ కమ్యూనిటీ భవనాలకు స్థలం మరియు నిధులు మంజూరు చేయాలని.కల్లు గీత కార్మికులకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి,అంగవైకల్యం చెందిన వారికి గత ప్రభుత్వం లో పెండింగ్ లో ఉన్న ఎక్గ్రేషియా నిధులు వెంటనే విడుదల చేయాలి.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గౌడ కుటుంబాలకు మరింత మేలు చేయాలని ఆకాంక్షతో వారికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పేద గౌడ కుటుంబాలకు ఉపాధి లభించే విధంగా వారికి సబ్సిడీతో కూడిన రుణాలు, చేతి వృత్తుల వారికి పనిముట్లు, అనేక రకాల అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అందిస్తూ గౌడ కుటుంబాలకు మేలు చేస్తున్నారన్నారు .ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్రంలో ఉన్న గౌడ సంగీయులకు, వారి కుటుంబాలకు వివరించి, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రవ్యాప్తంగాతీసుకువెళ్లే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లు   శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్, మట్ట ప్రకాష్ గౌడ్ వీరమల్ల వరలక్ష్మి కందుల వెంకటరమణ జంపాని రామచంద్ర గౌడ్ బడుగు శ్రీకాంత్ వెలగాన సూర్యారావు పామర్తి వెంకటరామయ్య మట్ట మంగరాజు తుమ్మల చంగయ్య మరియు బీసీ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *