NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రెస్ బలోపేతా నికి ఇమ్రాన్ ప్రతాప్‌ గర్హి కృషి అమోఘం

1 min read

కొనియాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్‌.రెడ్డీ సాహెబ్

 మదనపల్లె ఆగస్టు 6, న్యూస్ నేడు ప్రతినిధి : ప్రముఖ ఉర్దూ కవి, రాజ్యసభ సభ్యులు,  కాంగ్రెస్ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్‌ గర్హి పుట్టినరోజు వేడుకలు మదన పల్లె పట్టణం   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రెడ్డీ సాహెబ్ ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్, మైనారిటీ విభాగం నాయకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ తనదైన శైలిలో  కవిత్వం ద్వారా పార్లమెంట్‌లో, బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ వాణిని గట్టిగా వినిపించే నాయకు డని కొనియాడారు. ఇమ్రాన్ ప్రతాప్‌ గర్హి ప్రముఖ ఉర్దూ కవి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు,  రాజ్యసభ సభ్యులు గా,ఏఐసీసీ  మైనారిటీ శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు‌. రాహుల్ గాంధీని ప్రదానమంత్రి చేయాలని దృఢ సంకల్పంతో పని చేసే ఇమ్రాన్ ప్రతాప్‌ గర్హి మరిన్ని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని  ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి,మదనపల్లె టౌన్ మైనారిటీ విభాగం అధ్యక్షులు మహబూబ్ పీర్,మదనపల్లె మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు మహమ్మద్ అలీ,సీనియర్ నాయకురాలు మీనా కుమారి, నాగరాజు,సయ్యద్ సమీర్,తేజ,బావాజాన్,దస్తగిరి,హబీబ్ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *