పిఎండిఎస్ పంటల సాగు తో ద్వారా రైతు కు ఆదాయం..జిల్లా కలెక్టర్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పిఎండిఎస్ పంటల సాగు ద్వారా రైతుకు ఆదాయం వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పేర్కొన్నారు దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామపంచాయతీ ఈదుల దేవరబండ గ్రామంలో రైతు రాముడు తన 3 ఎకరాల్లో పొలంలో పీఎండీఎస్ (PMDS – Pre-Monsoon Dry Sowing) విధానం ద్వారా చేపట్టిన పంటల సాగును మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మరియు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రైతు రాముడు మూడు ఎకరాల భూమిలో రెండు ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి, బోరు నీరు తక్కువగా ఉన్నప్పటికీ సమర్థవంతంగా వినియోగిస్తూ బెండ ,ఆముదం, చిక్కుడు, బీట్రూట్,బీరకాయలు,వంకాయి,టమాటా ,క్యారెట్, ముల్లంగి,మొక్కజొన్న , తోటకూర, పెసలు, మినుములు, కొత్తిమీర,పాలకూర , గోంగూర తదితర 18 రకాల పంటలను సాగు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.పీఎండీఎస్ విధానంలో బహుళ పంటల సాగు చేపట్టడం వల్ల తక్కువ నీటితోనే అధిక ప్రయోజనం పొందవచ్చని, వర్షపు నీరు భూమిలో ఇంకి భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేల సారవంతం మెరుగుపడుతుందని కలెక్టర్ వివరించారు. వివిధ పంటల వేర్ల వ్యవస్థల కారణంగా నేలలో సూక్ష్మజీవుల పెరుగుదల కూడా అధికమవుతుందన్నారు. అదే విధంగా పీఎండీఎస్ విధానంలో సాగు చేసిన మొక్కజొన్న పంటలో సాధారణంగా ఒకే కంకి వచ్చే చోట నాలుగు కంకులు రావడం వంటి మెరుగైన ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేసాయాన్నారు. రైతులందరూ ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించి 18 నుంచి 20 రకాల విత్తనాలతో బహుళ పంటల సాగు చేపట్టి, స్థిరమైన ఆదాయంతో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.అనంతరం హాఫ్ మూన్ మోడల్ లో పీఎండీఎస్ (PMDS – Pre-Monsoon Dry Sowing) విధానం ద్వారా ఆముదం, అలసందలు, తదితర విత్తనాలను రాముడు పొలంలో కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ విత్తనాలు నాటారు.కార్యక్రమంలో నాచురల్ ఫార్మింగ్ అధికారి మాధురి , డి ఎల్ ఎఫ్ పి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


