చింతలపల్లి’లో పొలం పాస్ పుస్తకాల పంపిణీ
1 min read
771 మంది రైతులకు పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం’మీ భూమి-మీ హక్కు’కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరంతరం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని గత వైకాపా ప్రభుత్వం ఎన్నో తరాల నుండి వచ్చిన రైతుల భూములకు వారి ఫోటోలు ఉండేవి.కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతరైతుల పొలాలకు సంబంధించి నాణ్యతగా రాజముద్రత కూడిన పొలం పాస్ పుస్తకాలను ప్రతి రైతుకు అందజేస్తున్నామని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం అమలు చేసింది.ఈ మధ్యనే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 13 నగదు వేయడం జరిగిందన్నారు. వీటితో పాటు గ్రామాల్లో డ్రైనేజీ,సిమెంట్ రోడ్ల ద్వారా అభివృద్ధి చేస్తున్నామని గ్రామంలో 771 పొలం పాస్ పుస్తకాలు వచ్చాయని ఇంకా పుస్తకాలు రావాల్సి ఉంది మిగతా పుస్తకాలు తర్వాత వస్తాయని అన్నారు.తర్వాత రైతులకుపొలం పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వెంకట శివుడు,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంపీడీవో దశరథ రామయ్య,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, సహకార సొసైటీ చైర్మన్ ఆర్ వెంకటేశ్వర రెడ్డి,వంగాల శివరామిరెడ్డిమాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి, దేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


