NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్ఠీకరణ

62 మందికి 76 లక్షల 81 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వో సి లు  పంపిణీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ పరంపర నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 55 మంది బాధితులకు వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 49లక్షల, 80వేల, 256 రూపాయల విలువైన 55 చెక్కులను, అలాగే 27లక్షల, ఒక వెయ్యి  723 రూపాయల విలువైన  7 ఎల్‌వోసి కాపీలను బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. వారికి భరోసా కల్పించారు. అన్నివిధాలా అండగా ఉంటానంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల సూచనల మేరకు అనునిత్యం ప్రజలకు చేరువగా ఉంటూనే వారి అవసరాలను తెలుసుకోవడంతో పాటూ వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతూ వస్తున్నామన్నారు. దానిలో భాగంగానే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వారికి ఆర్ధిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ మొత్తం 778 మందికి 7కోట్ల, 12లక్షల, 38వేల, 018 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి, వారికి ఆర్థిక భరోసా కల్పించినట్లు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. దాంతో పాటూ నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో పాటూ వివిధ సందర్భాల్లో సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహించి లక్షల రూపాయల  ఆర్ధిక సాయాన్ని పేదలకు అందజేసి స్ఫూర్తివంతమైన సేవా ప్రయాణాన్ని నిరంతరాయంగా ముందుకు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు మీరావలి, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,  ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *