NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

1 min read

సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయాలి

పాదయాత్రను ప్రారంభించిన సిపిఐ జాతీయ సీనియర్  నాయకులు కె. నారాయణ

మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి  : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) దేశ వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ వరకు చేపట్టిన పాద యాత్రలో అన్న మయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లో గురువారం  ఎన్టీఆర్ సర్కిల్ నుండి సిపిఐ జాతీయ సీనియర్ నాయకులు కే నారాయణ ప్రారం భించారు.  ఈ పాద యాత్ర ఎన్టీఆర్ సర్కిల్ నుండి, బెంగళూరు బస్టాండ్ మీదుగా చిత్తూరు బస్టాండ్ వరకు కొన సాగింది. ఈ సందర్బంగా కే నారాయణ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్స రాలైన  ఉపాధి క్షల్పించకపొగా, ప్రజల నడ్డి విరు స్తున్నారని ఆరోపించారు.మెడికల్ కళాశాల లను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గ మని ప్రభుత్వమే వైద్య విద్యను అందించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి జిల్లాలో పశుగ్రాస కేంద్రాలనుఏర్పాటు చేయాలని, హంద్రీ నీవా కాలువ పూర్తి చేసి ఈ జిల్లాలో  చెరువులను నింపాలని, మదన పల్లెలో  సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేసి  త్రాగు నీరు అందించాలని, బిటి కళాశాలను యూని వర్సిటీగా మార్చా లని  డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, కార్యవర్గ సభ్యులు సాంబ శివ, నియోజకవర్గ కార్యదర్శి కే మురళి, నాయ కులు రెడ్డి శేఖర్, నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే మాధవ్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షు లు విజయన్, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి హరి, తిరుమల ,దేవా ,సురేష్ ,బాలు, భార్గవి నవ్య, రెడ్డప్ప  కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *