NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైబర్ సెక్యూరిటీ మొదలైన ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఇంజినీరింగ్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ మొదలైన ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ ఆచార్య పి. వెంకట సుందరానంద్ సూచించారు. వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ విభాగంవారి ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మరియు IBM స్కిల్‌బిల్డ్ వారి సహకారంతో అన్ని బ్రాంచులకు చెందిన 5వ సెమిస్టర్ B.Tech విద్యార్థులకోసం నిర్వహిస్తున్న ఉచిత డిజిటల్ స్కిల్లింగ్ బూట్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ ఈశిక్షణలో భాగంగా AI ఫండమెంటల్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, మినీ ప్రాజెక్ట్ మొదలైన అంశాలపై ఆయా సంస్థలకు చెందిన నిపుణులు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ఆయన తెలిపారు. నేటినుండి 13 వతేదీవరకు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వివరించారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న IBM డిజిటల్ క్రెడెన్షియల్స్ అందించనున్నట్లు ఆచార్య సుందరానంద్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సాంకేతిక మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలసినదిగా ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్లు డాక్టర్ జి. సురేంద్ర, ఎ. శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, మ్యాజిక్ బస్ సంస్థకు చెందిన టెక్నికల్ యూత్ ట్రైనర్లు కె. అశ్వని, డి. అరవిద్ నాయక్, ప్రొఫైలింగ్ ఆఫీసర్ బి. వెంకటేశురెడ్డితోపాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *