అభివృద్ధి సంక్షేమమే..ప్రభుత్వ లక్ష్యం
1 min read
తలముడిపిలో’రెండేళ్ల నమ్మకం’లో ఎమ్మెల్యే..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో సోమవారం సాయంత్రం మండల సీనియర్ నాయకులు వంగాల శివరామిరెడ్డి ఆధ్వర్యంలో’రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం’ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఇంటింటికి వెళ్లి గత రెండేళ్ల పాలనలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత కుటుంబ ప్రభుత్వానికే దక్కిందన్నారు.ఏ ప్రభుత్వం చేయనంతగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ తదితరవాటి అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మండలాల కన్వీనర్లు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఖాతా రమేష్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి కమతం రాజశేఖర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి, సుధాకర్ రెడ్డి,తహసిల్దార్ శ్రీనివాసులు,స్వర్ణ గ్రామ మండల అధికారి సురేష్ కుమార్,తెలుగు యువత నాయకులు దేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రమణారెడ్డి,చాకర్ వలి మరియు అధికారులు పాల్గొన్నారు.


