NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గ  ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండేళ్ళ నమ్మకం – అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు ప్రజల్లో అలజడులు సృష్టించేందుకు మాత్రమే విపరీత దోరణులతో విధ్వంస కార్యకలాపాలకు తెరతీశారంటూ ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండేళ్ళ నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక 25వ డివిజన్‌ శనివారపు పేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కాగా,, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి వినూత్నంగా ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీ చిహ్నమైన సైకిల్‌ ఎక్కిన ఆయన,,, స్థానిక అమరావతి సర్కిల్‌ నుండి శనివారపు పేట వరకూ సైకిల్‌ను తొక్కి, అటు పార్టీ నాయకులు, కార్యకర్తల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా శనివారపు పేటకు చేరుకున్న ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం స్థానిక సిద్ధి వినాయక ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. తదనంతరం డివిజన్‌లోని ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. పథకాలు సమృద్దిగా అందుతున్నదీ, లేనిదీ ఆరా తీశారు. ఇదేసమయంలో ఆ ప్రాంతంలోని ఒక చేనేత పరిశ్రమలోనికి వెళ్ళిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, నేత కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మీరావలీ, ఏపి మాలల ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఏఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇంచార్జ్ గూడవల్లి శ్రీనివాస్, డివిజన్ ఇంచార్జ్ లు సోమిశెట్టి రాము, కడియాల విజయలక్ష్మి, చేకూరి గణేష్, రెడ్డి రామకృష్ణ,కో డివిజన్ ఇంచార్జ్ మట్ట శ్రీను, జనసేన డివిజన్ ఇంచార్జ్ లోవరాజు,మాజీ కార్పొరేటర్లు గునుపూడి శ్రీనివాసరావు, కలవకొల్లు సాంబ, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, శనివారపు పేట సొసైటీ బ్యాంకు చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, ఏలూరు టౌన్ రైట్స్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్,బిఎస్ఎన్ఎల్ అడ్వైజరి బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు,కుటమి పార్టీల నాయకులు కడిమి రమేష్, మందపల్లి అబ్రహం పాలస్,చాంద్ బాషా, వేమూరి శ్రీధర్, లంక రాజబాబు, సామర్ల వెంకటేశ్వరరావు, బయ్యారపు కుటుంబరావు, వెంకటేశ్వరరావు, నడపన భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *