NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుందలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

150 మీటర్ల జాతీయ జెండాతో దేశభక్తి ర్యాలీ

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న గ్రామ ప్రజలు

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద గ్రామ ప్రజల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం హొళగుంద బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, యువత, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హొళగుంద ఎస్‌ఐ దిలీప్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి భావాన్ని చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సుమారు 150 మీటర్ల జాతీయ జెండాతో ప్రత్యేక దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. హొళగుంద బస్టాండ్ నుంచి ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో యువత, గ్రామ ప్రజలు జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ దిలీప్ కుమార్ గురజాల, ఏఎస్‌ఐ, సామాజిక ప్రజాస్వామ్య పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్లా ఇర్ఫాన్, ఆలూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఎఫ్. అబ్దుల్ హమీద్, కె. సలామ్, వైఎస్సార్‌సీపీ మండల పరిషత్ అధ్యక్షుడు ఈసా, తెలుగుదేశం పార్టీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మొహిన్, అబ్దుల్ రహిమాన్, అమీన్ తదితరులు పాల్గొన్నారు.వీరితో పాటు గ్రామ ప్రజలు, యువత, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవం చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *