మదరసా ఆయేషా సిద్దిఖాలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
1 min read
విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు – ఈబీజీ గోవింద్ గౌడ్
హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని మదరసా ఆయేషా సిద్దిఖా, ఆయేషా సిద్దిఖా ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్, టీడీపీ కో-కన్వీనర్ జాకీర్, టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షులు ముల్లా మోయిన్, మండల మైనార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముఖ్య అతిథులకు పాఠశాల విద్యార్థులు రోజ్ పుష్పాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. చదువుతో పాటు దేశభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణను అలవర్చుకుని దేశానికి సేవ చేయాలని సూచించారు.కార్యక్రమంలో మదరసా ఆయేషా సిద్దిఖా హెడ్‌మాస్టర్ మౌలానా అబూబకర్, మౌలానా షాకీర్, మౌలానా సుభాన్, పాఠశాల ఉపాధ్యాయులు, మైనార్టీ మత పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదివి మంచి పౌరుడిగా ఎదిగి దేశ అభివృద్ధికి తన వంతు సేవ చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.



