NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎందరో త్యాగమూర్తులు త్యాగఫలమే నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

ఏ.వి.ఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా వందేమాతర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏ వి ఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగపలమే నేడు మనం జరుపుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్నారు. ఈ ఈ ఏ.ఎస్.ఆర్. సి. మూర్తి మాట్లాడుతూ మన భారతదేశం  మతాలు, ప్రాంతాలు,ఆచారాలతో  ఐకమత్యమై  భిన్నత్వంలో ఏకత్వంతో ఐక్యంగా స్వాతంత్రాన్ని  సాధించుకున్నామన్నారు. జనగణమన  గీతాలపనతో కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది మిఠాయిల పంచి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈ కె.సంధ్యా డయాన, ఎస్ రమేష్ మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author