ఉత్తమ అవార్డ్ అందుకున్న స్పెషల్ బ్రాంచ్ ఈశ్వర్
1 min read
ముచ్చుమర్రి ఎస్సై..పోలీసులకు అవార్డులు
నందికొట్కూరు న్యూస్ నేడు:నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు మరియు మిడుతూరు పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ పి ఈశ్వర్ ఉత్తమ అవార్డు అందుకున్నారు.నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శనివారం ఉదయం జరిగిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్,నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి,జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ ఈశ్వర్ కు ఉత్తమ అధికారిగా అవార్డును అందజేశారు. ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్న వారి వివరాలు: ముచ్చుమర్రి ఎస్ఐ కే నరేంద్ర,పాములపాడు, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ దామోదర్,జూపాడుబంగ్లా హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ నాయక్,నందికొట్కూరు పట్టణ కానిస్టేబుల్ రాయుడు,బ్రాహ్మణకొట్కూరు హెడ్ కానిస్టేబుల్ రమణ మంత్రి నుండి అవార్డులు అందుకున్నారు.ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది వీరిని అభినందించారు.


