NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న పత్తికొండ ఆర్డీఓ కు ఘన సన్మానం

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ప్రజా సేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న పత్తికొండ డివిజన్ రెవెన్యూ డివిజనల్ అధికారి బి. చిన్న ఓబులేష్‌ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్ ఘనంగా సన్మానించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఆర్డీఓ బి. చిన్న ఓబులేష్‌ను అభినందిస్తూ ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో పత్తికొండ కార్యాలయంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న అధికారులను అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని ఆకాంక్షించారు.ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం పత్తికొండ డివిజన్‌కు గర్వకారణమని, బి. చిన్న ఓబులేష్ భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఈబీజీ గోవింద్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్. పంపాపతి, యారిస్వామి, దీడి నాగప్ప, టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షుడు ముల్లా మోయిన్, సింధువలం మాలి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *