NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ సీనియర్ నాయకుడు కడితం బాలిరెడ్డి మృతి

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నాయకుడు కడితం బాలిరెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న డోన్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు కోట్ల సుజాతమ్మ ప్యాపిలిలోని కడితం బాలిరెడ్డి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్ట సమయంలో టీడీపీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గడ్డం అంకిరెడ్డి, మైనారిటీ నాయకులు ఖాజా పీర్, కమతం భాస్కర్ రెడ్డి, చల్లా అనుదీప్ కుమార్, బంకు నాగేంద్ర, ప్రతాప్ రెడ్డి తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని కడితం బాలిరెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *