NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఏలూరు రూరల్ ఎస్ఐ

1 min read

అభినందించినఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్

ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్నేడు: 2012 వ సంవత్సరంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఎంపికైన  వేముల వెంకటేశ్వరరావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి,నల్లజర్ల, పాలకోడేరు,భీమవరం వన్ టౌన్,గణపవరం,కలిదిండి పోలీస్ స్టేషన్లలో విధులను నిర్వర్తించి, ప్రస్తుతం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్.ఐ.గా సేవలందిస్తున్నారు.మౌంటెనీరింగ్ పర్వతారోహణ పై ఉన్న మక్కువతో ఆయన కఠినమైన శిక్షణను పూర్తి చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి ట్రాన్సెంట్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ స్కూల్ శిక్షణ పొందారు. లే-లడఖ్ లో ఇంటర్మీడియట్ ఎక్స్పెడిషన్ ట్రైనింగ్. డార్జిలింగ్‌ లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకొన్నారు.రికార్డు సృష్టి  జాతీయ గీతాలాపనస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల స్ఫూర్తితో రష్యాలోని యూరప్ ఖండంలోకెల్లా అత్యున్నతమైన మౌంట్ ఎలబ్రోస్ 5,642 మీటర్లు పర్వతాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించారు.80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా 100 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి జాతీయ గీతం ఆలపించారు.ఆంధ్రప్రదేశ్ పోలీస్ లోగోతో పాటు,ఆంధ్రప్రదేశ్ డి.జి.పి. మరియు ఏలూరు జిల్లా ఎస్పీ ఫోటోలను ప్రదర్శించి రాష్ట్ర పోలీసు శాఖ కీర్తిని ప్రపంచ వేదికపై చాటారు.గతంలో ఉన్న 78 మీటర్ల రికార్డును అధిగమించి 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు భవిష్యత్తులో ప్రపంచ ఎత్తయిన మంచు పర్వతం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించినారు. అనంతరం ఎస్.ఐ.ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.పట్టుదల ఉంటే ఏ కఠినమైన లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపిస్తూ మౌంట్ ఎలబ్రోస్ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఏలూరు రూరల్ ఎస్.ఐ. వేముల వెంకటేశ్వరరావు సాహసం అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటోంది.ఈ కార్యక్రమంలో ఏలూరు డి.ఎస్.పి శిరిడి శ్రావణ్ కుమార్ ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ ఏలూరు ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఎస్సై నాగబాబు ఏలూరు వన్ టౌన్ ఎస్ఐ సుధాకర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *