టీచర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
1 min read
నందికొట్కూర్ ఎంఈఓ రామిరెడ్డి..
నందికొట్కూరు న్యూస్ నేడు: 2026-27 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ ఇన్ స్ట్రక్చర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని నందికొట్కూరు ఎంఈఓ ఎస్.రామిరెడ్డి మరియు కే శ్రీనివాసులు మంగళవారం అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనుటకు ఈనెల 21వ తేదీ సాయంత్రం లోపు నందికొట్కూరు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు. నందికొట్కూరు మండలంలో ఎస్జిటి-2, స్కూల్ అసిస్టెంట్ 11 ఉన్నాయి.ఖాళీల వివరాలు: ఎస్జిటి కొణిదేల ఎంపీపీఎస్-1,అల్లూరు ఎంపీపీఎస్ స్పెషల్-1 మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు:నందికొట్కూరు ప్రభుత్వ హైస్కూల్ లో ఉర్దూ-1,హిందీ-2,ఇంగ్లీష్-2, గణితం-1,మల్యాల జెడ్పిహెచ్ఎస్ ఇంగ్లీష్-1, నందికొట్కూరు ప్రభుత్వ హైస్కూల్ జీవశాస్త్రం ఉర్దూ-1..నందికొట్కూరు బాలికల జిల్లా పరిషత్ పాఠశాల, బిజినవేముల,దామగట్ల, బ్రాహ్మణకొట్కూర్ సోషల్ సబ్జెక్ట్ ఖాళీగా ఉన్నాయని ఈ అవకాశాన్ని అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవో లు రామిరెడ్డి, శ్రీనివాసులు కోరారు.పగిడ్యాల మండలం లక్ష్మాపురం ఎంపీయూపీ పాఠశాలలో ఎస్జిటి ఒక పోస్ట్ ఖాళీగా ఉందని ఎంఈఓ సుభాన్ తెలిపారు.


