NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్ర పాఠశాలలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు: అబ్బాస్ నగర్‌లోని రవీంద్ర పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయాలు ఉట్టిపడేవిధంగా,చిన్నారుల ఆనందోత్సాహాల మధ్య వైభవంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, నైతిక విలువలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ జి. పుల్లయ్య, వైస్ ఛైర్మెన్  జి. వంశీధర్ హాజరై చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో మురిపించారు. చిన్నారుల కృష్ణవేషధారణ, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విద్యార్థులు శ్రీకృష్ణుని బాల్యలీలలు, స్నేహం, ప్రేమ, ధైర్యం, ధర్మబద్ధమైన జీవనం వంటి అంశాలను తమ ప్రదర్శనల ద్వారా చక్కగా ఆవిష్కరించారు. రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం. మోహన్ కుమార్, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతమోహన్  విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్ సౌమ్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతల్లిదండ్రులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *