NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 జీఎన్ఎం అడ్మిషన్లకు పకడ్బందీగా కౌన్సిలింగ్ నిర్వహించాలి

1 min read

ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ జీఎన్ఎం స్కూల్స్‌ను కౌన్సిలింగ్‌లో భాగస్వామ్యం చేయాలి

జాబితాలో లేని అర్హత కలిగిన కళాశాలలకు రెండో దశలో అవకాశం కల్పించాలి

కర్నూలు, న్యూస్​ నేడు: 2026–27 విద్యా సంవత్సరానికి GNM (General Nursing and Midwifery) అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, కర్నూలు జిల్లాలో జీఎన్ఎం అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా జీఎన్ఎం అడ్మిషన్లకు జిల్లా స్థాయిలో సమగ్ర కౌన్సిలింగ్ విధానం నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ జీఎన్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో మాత్రమే అడ్మిషన్లు నిర్వహించడం కాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన ప్రైవేట్ జీఎన్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లను కూడా కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని కోరారు.విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మెరిట్,విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేసే సంస్థలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ జీఎన్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లను కలుపుకొని పారదర్శకమైన కౌన్సిలింగ్ విధానం వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు కర్నూలు జిల్లా డిఎంహెచ్ఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *