విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలిచిన పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్
1 min read
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం,స్వావలంబన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలి
చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
యంఎల్ఎ చేతుల మీదగా 25 మందికి ట్రై సైకిళ్ల పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చింతలపూడి నగర పంచాయతీ స్థానిక సివిఏపీయు కార్యాలయంలో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతులకు 25 ట్రై సైకిళ్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, స్వావలంబన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అన్నారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.


