కేరళలోని అమృతపురి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
1 min read
మాతా అమృతానందమయి దేవితో భేటీ
అమృతపురి(కొల్లం) న్యూస్ నేడు : కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ముందుగా అమృతపురి ఆశ్రమానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ దేవాలయాన్ని, కలరిని మంత్రి సందర్శించారు. అనంతరం శ్రీ మాతా అమృతానందమయి దేవితో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాతా అమృతానందమయి దేవి ఆశీస్సులు పొందారు. అనంతరం అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్ ను, అమృత ఆయుర్వేద కళాశాలను మంత్రి సందర్శించారు. దాదాపు మూడు గంటలపాటు ఆశ్రమంలో గడిపారు.



