NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఒక్కరూ పర్యావరణహిత మట్టి విగ్రహాలను వినియోగించాలి

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు:  పర్యావరణ పరిరక్షణ పై అవగాహన సదస్సు” ఆంధ్రప్రదేశ్  పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజినల్ ఆఫీస్ కర్నూల్,అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్  ఇంటర్నేషనల్ జిల్లా 117 , లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ మరియు జిల్లా న్యాయ సేవాది కార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో   కర్నూలు ఏ. క్యాంపు నందు గల ఇందిరా గాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాల నందు పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లడుతూ   ప్లాస్టర్ ఆఫ్ పారిస్  విగ్రహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుందని కానీ మట్టి వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించడంతో పాటు, సహజసిద్ధమైన మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసి పూజించే సంస్కృతిని విద్యార్థుల్లో, ప్రజల్లో ప్రోత్సహించడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రాథమిక హక్కులు,  కాలుష్య నివారణ మరియు కార్మిక హక్కులు, వినియోగదారుల రక్షణ మొదలగు చట్టాలపై మరియు లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 పై అవగాహన కల్పించారు.అనంతరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  ప్రకృతిని కాపాడుతూ భక్తిని కొనసాగించేలా ప్రతి ఒక్కరూ పర్యావరణహిత మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు. అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్  మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పర్యావరణ స్పృహ, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు మట్టి విగ్రహాల తయారీ పోటీలు ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.అనంతరం జాతీయ పోషణ వారోత్సవాలలో భాగంగా డాక్టర్ బాలస్వామి  విద్యార్థులకు గుడ్డు తినడం వల్ల కలిగే పోషకాలను గురించి వివరించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు ఒక గుడ్డు తింటే శరీరానికి పోషకాలు లభిస్తాయని తెలిపారు. ఈ సదస్సులో డాక్టర్ బాలస్వామి  పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్,జర్నలిస్ట్ ప్రెసిడెంట్ ఇస్సాక్ మరియు జర్నలిస్ట్ లు బాబురావు సురేష్ లు, ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రోజా, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author