NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిల్వర్ జూబ్లి కాలేజిలో  ప్రపంచ ఆత్మహత్యల నివారణపై అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సిల్వర్ జూబ్లి కాలేజిలో  ప్రపంచ ఆత్మహత్యల నివారణ అవగాహన దినోత్సవం  పురస్కరించుకొని మానసిక ఆరోగ్య సమస్యల బ్యానర్ ను  ప్రిన్సిపాల్ డాక్టర్.  మరియు   మాస్ మీడియా అధికారి ప్రకాష్ రాజ్  మరియు లెక్చరర్  డాక్టర్.ఫరిదా బేగం  తో కలిసి ఆవిష్కరించినారు.అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్.నాగరాజు శెట్టి   మాట్లాడుతూ ఏదైనా ఆత్మహత్య  చేసుకోవాలనే ఆలోచన అత్యంత ప్రమాదకరం దీన్ని నుంచి బయటపడలంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి ,తీవ్రస్థాయికి పెరిగిన మానసిక ఒత్తిడి,సంఘర్షణలతో పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆత్మహత్య చేసుకొనేముందు ఒక్క క్షణం ఆలోచించాలని తెలిపారు.మరణించాలనుకొనే వారి ప్రవర్తన భిన్నంగా ఉంటుందని ,ఒంటరిగా ఉండడము,దురలవాట్లు పెంచుకోవడము,నిరాశ,నిస్ప్పృహాలతో మాట్లాడుతారు.జీవితం వ్యర్థమానే బాధలో తమకిష్టమైనవి ఇతరులకు ఇస్తారని తెలిపారు. . ఆత్మహత్యల నివారణకు టెలిమానస్ టోల్ ఫ్రీ నంబర్ 14416 ను సంప్రదించి నిపుణుల ద్వారా ఉపశమనం పొందవచ్చునని.ఇక్కడ సుశిక్షితులైన సైకియాట్రిస్టులు,కొన్సిలర్ లు తగిన సలహాలు సూచనలు అందిస్తారని అన్నారు.ఈ కార్యక్రమములో  లెక్చరర్  డాక్టర్.ఫరిదా బేగం  ,డెప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్  ఆఫీసర్  పద్మావతి ,విద్యార్థులు    మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author