శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్
1 min read
భక్తుల సౌకర్యార్ధం సుమారు రూ.25,00,000/-ల వ్యయం తో నిర్మించనున్న మరుగు దొడ్లకులకు ముహూర్తం
సుమారు 1950 మందికి అన్నప్రసాద వితరణ
వివిధ సేవల రూపేణా 2,73,457/-లు సమకూరినది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము ఈ రోజు మంగళవారం సందర్భముగా చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు మద్యాహ్నం గం.03.00 ల వరకు శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా 2,73,457/-లు సమకూరినది. శ్రీ స్వామి వారి దేవస్థానమునకు విచ్చేసిన సుమారు 1950 మందికి అన్నప్రసాద వితరణ జరుపబడినది.శ్రీ స్వామి వారి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్ధం సుమారు రూ.25,00,000/-ల వ్యయం తో నిర్మించనున్న మరుగు దొడ్లకు ఈ రోజు ఉదయం గం.10.00 లకు ముహూర్తం చేసియున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లు శ్రీమతి ఓబిలినేని సూర్యభవాని, శ్రీ ధూళిపాళ సూర్య చంద్ర ప్రభాకరరావు, శ్రీ దూనబోయిన నారాయణమూర్తి శ్రీమతి జగన్నాధం వెంకటమ్మ వార్లు పాల్గొనినారు శ్రీ స్వామి వారి దేవస్థానకు ప్రముఖ డైరక్టరు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ విచ్చేసి స్వామి వారిని దర్శించుకునినారు. అనంతరం వీరికి ఆలయ ముఖ మండపం నందు వేద ఆశీర్వచనo గావించి తీర్ధప్రసాదంలు చిత్రపటమును బహుకరించారని ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షులు శ్రీ రాజాన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు.


