NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య సేవలు, అధునాతన ఇంటర్వెన్షనల్ విధానాల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు డా. ఎన్. చైతన్య కుమార్ , డా. సి.ఎస్. తేజ నందన్ రెడ్డి , డా. బి.ఎస్. ప్రవీణ్ కుమార్ తో పాటు కాథ్‌ల్యాబ్ బృందం కలిసి కేక్ కట్ చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీని జరుపుకున్నారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గుండెకు సంబంధించిన అనేక సమస్యలకు తక్కువ ఇన్వేసివ్ విధానాల ద్వారా చికిత్స అందించడంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకోవడం, వెంటనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందడం ఎంతో ముఖ్యమని సూచించారు.మెడికవర్ హాస్పిటల్స్‌లో అధునాతన క్యాథ్‌ల్యాబ్ సదుపాయాలతో పాటు అనుభవజ్ఞులైన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, కాథ్‌ల్యాబ్, అనస్థీషియా, నర్సింగ్ మరియు ఇతర సహాయక బృందాల సమన్వయంతో గుండె సంబంధిత చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయంలో వేగంగా స్పందించడంలో సమిష్టి వైద్య బృందం కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.మెడికవర్ హాస్పిటల్స్‌, కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ, “ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఆధునిక గుండె వైద్యరంగంలో ఎంతో ముఖ్యమైన విభాగం. అత్యవసర గుండె సమస్యలతో వచ్చే రోగులకు సరైన సమయంలో, నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అందించడం చాలా అవసరం. మా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, కాథ్‌ల్యాబ్ బృందం సమన్వయంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మా వైద్యులు, కాథ్‌ల్యాబ్ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *