NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్లిష్ట పరిస్థితులను అధిగమించి వైభవంగా వినాయక నిమజ్జనం: మంత్రి టీజీ భరత్

1 min read

హంద్రీనీవాలో బోటులో ప్రయాణించిన మంత్రి

వినాయక ఘాట్ లోమొదటి వినాయకుడి విగ్రహానికి నిమజ్జనం

కర్నూలు, న్యూస్​ నేడు : నీటి కొరత వంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించి వినాయక నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా కర్నూలులోని రాంబొట్ల దేవాలయం వద్ద వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, అనంతరం నిమజ్జన ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వినాయక చవితికి ముందు సుంకేసుల, కేసీ కెనాల్‌లో నీరు లేకపోవడంతో నిమజ్జనంపై కొంత ఆందోళన నెలకొందన్నారు. అయితే ముందుగానే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టడం వల్ల సమస్యను పరిష్కరించుకోగలిగామని తెలిపారు.కేసీ కెనాల్‌ లో రెండు  వైపులా గోడలు నిర్మించి, పంప్ హౌస్ ద్వారా ప్రతిరోజూ సుమారు 20 లక్షల లీటర్ల వాష్ వాటర్‌ను తీసుకొచ్చి నీటిని నిల్వ చేసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే నన్నూరు టోల్ ప్లాజా వద్ద హంద్రీనీవాలో పెద్ద విగ్రహాల నిమజ్జనానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్లిష్ట పరిస్థితులను అధిగమించి నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అనుభవం అధికారులతో పాటు ప్రజలకు కూడా వచ్చిందన్నారు. నిమజ్జన ఏర్పాట్ల కోసం కష్టపడి పనిచేసిన జిల్లా అధికారులను మంత్రి అభినందించారు.అనంతరం వినాయక ఘాట్‌ను మంత్రి పరిశీలించారు. నన్నూరు టోల్ ప్లాజా వద్ద హంద్రీనీవాలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, రెస్క్యూ టీంతో కలిసి బోటులో ప్రయాణించారు. మధ్యాహ్నం వినాయక ఘాట్ వద్ద నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని మొదటి వినాయకుడి విగ్రహానికి నిమజ్జనం నిర్వహించారు.అలాగే రాంబొట్ల దేవాలయం వద్ద నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంపాటలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తరఫున మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *