లైఫ్ సైన్సెస్ విద్యార్థులు తమకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: లైఫ్ సైన్సెస్ విద్యార్థులు తమకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వైస్ ఛాన్సలర్ ఆచార్య వి. వెంకట బసవ రావు పిలుపునిచ్చారు. రాయలసీమ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వారు సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలలో పరిశోధనలో ఇటీవలి పోకడలు మరియు వృత్తి అవకాశాలపై వర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహించిన ఒక రోజు జాతీయ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులకు ఆయా రంగాల్లో గల అవకాశాలపై పరిజ్ఞానం సంపాదించుకోవడానికి ఈ రకమైన సదస్సులు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు.కార్యక్రమానికి సదస్సు కన్వీనర్ ఆచార్య ఆర్. భారత్ కుమార్ స్వాగతం పలికి సదస్సు లక్ష్యాలను వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాలు మరియు పర్వత ప్రాంతాలకు అనువైన నీటి శుద్ధి పద్ధతుల గురించి ఐఐసిటి, హైదరాబాద్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. శ్రీధర్ వివరంగా వివరించారు. అంతేకాకుండా, IITలు, NIN, CDFD, CIMAP, IISER మరియు NIPER వంటి సంస్థలలో లైఫ్ సైన్సెస్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్న సెషన్లో, హైదరాబాద్లోని IICTకి చెందిన మరో శాస్త్రవేత్త డాక్టర్ పి. ఆనంద్ వ్యర్థాల నిర్వహణపై ఉపన్యాసించారు. వ్యవసాయ, పశు మరియు కూరగాయల వ్యర్థాలను శక్తిగా ఎలా మార్చవచ్చో ఆయన వివరించారు. అనంతరం జరిగిన పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీల్లో అధ్యాపకులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి. విజయ్ కుమార్ నాయుడు, ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథ్ రెడ్డి, సెమినార్ నిర్వాహకులు ఆచార్య ఆర్. భరత్ కుమార్, డీన్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డితో పాటు లైఫ్ సైన్స్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.


