NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్డు ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు తగు సూచనలు,సలహాలు

1 min read

పెదపాడు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం

నూజివీడు డి.ఎస్.పి. కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్,పెదవేగి ఇన్‌స్పెక్టర్ సి.హెచ్.రాజశేఖర్ 

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడులో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలనే ప్రధాన ఉద్దేశంతో మంగళవారం ఆటో డ్రైవర్లకు తగు సూచనలు, సలహాలు అందించారు. ఆటో నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ లేనివారు వెంటనే పొందాలని హెచ్చరించారు.ఆటోకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సి), ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సి), మరియు పొల్యూషన్ సర్టిఫికెట్లు ఎప్పుడూ వాహనంలోనే అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి ఆటోకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రక్షణగా నిలుస్తుందని డ్రైవర్లకు వివరించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆటోలో పరిమితికి మించి (ఓవర్‌ లోడ్) ఎవరినీ ఎక్కించకూడదని స్పష్టం చేశారు. డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఇది ప్రాణాల మీదకు తెస్తుందని, మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిగ్నల్స్, స్పీడ్ నిబంధనలు, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించి బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు. ప్రయాణికులతో, ముఖ్యంగా మహిళలతో మరియు పాఠశాల విద్యార్థులతో ఆటో డ్రైవర్లు మర్యాదగా, సురక్షితంగా వ్యవహరించాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, ప్రయాణికుల భద్రత కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్.ఐ. శ్రీనివాస్ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *