NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం అమలుకు సమావేశం

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు ఆదేశం

45 లక్షల రూపాయలతో 15 ఐస్ బాక్సులతో కూడిన మోటార్  బోట్లు,చేప పిల్లల పెంపకం,ఫింగెర్లింగ్ పెంపకం యూనిట్లు తదితర మౌలిక సదుపాయాల కల్పించడం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలోని ఎర్రకాల్వ జలాశయం వద్ద మత్స్య మరియు ఆక్వాకల్చర్ సమగ్ర అభివృద్ధి కోసం 2. 86  కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం అమలుకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం కింద ఎర్రకాల్వ జలాశయంలో మత్స్య మరియు ఆక్వాకల్చర్  అభివృద్ధికి మౌలిక సదుపాయాలు  మరియు ఆ ప్రాంతంలోని  మత్స్యకార కుటుంబాల చేపల వేట, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాల కోసం సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తో ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేయాలన్నారు. ఎర్రకాల్వ  జలాశయ పరిధిలో  664 మంది క్రియాశీల మత్స్యకారులు మరియు 664 లబ్ధిదారుల కుటుంబాలు ఉన్నాయని,వీరి ప్రస్తుత వార్షిక చేపల ఉత్పత్తి సుమారు 30 టన్నులన్నారు.చేపల వేట కార్యకలాపాలు,నాణ్యమైన చేప పిల్లల లభ్యత,చేపలను ఒడ్డుకు చేర్చే మరియు చేపల వేటకు అవసరమైన  మౌలిక సదుపాయాలు, కోల్డ్-చైన్ సౌకర్యాలు, రవాణా మరియు మార్కెటింగ్‌లను బలోపేతం చేయడం, తద్వారా చేపల ఉత్పత్తిని మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రతిపాదిత కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.  ఈ కార్యక్రమంలో  45 లక్షల రూపాయలతో 15 ఐస్ బాక్సులతో కూడిన మోటార్  బోట్లు,చేప పిల్లల పెంపకం, ఫింగెర్లింగ్ పెంపకం యూనిట్లు, వల గూడు తయారీ యూనిట్లు,ఐస్ బాక్సులతో కూడిన ఆటో రిక్షాలు,ఐస్ బాక్సులతో కూడిన మోటార్ సైకిళ్ళు,  ఐస్ ప్లాంట్, ఐస్ నిల్వ కేంద్రాలు,అమ్మకాల కోసం వేలం హాలు,తదితర మౌలిక సదుపాయాల కల్పించడం జరుగుతుందన్నారు. సమావేశంలో అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,మత్స్యశాఖాధికారి ఆర్.వి. ఎస్.కె. ప్రసాదరావు,జిల్లా పంచాయతీ అధికారి   ఇరిగేషన్ ఎస్ఈ జి. గోపాల్, భూగర్భ జల శాఖాధికారి  పి.కోదండరాం, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ  ఏ.రామచంద్రమూర్తి, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *