NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐ సత్తా చాటాలి

1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్

కార్పొరేషన్ 62డివిజన్ లలో ఎర్రజెండా రెపరెపలాడాలని పిలుపు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐ తన సత్తా చాటుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పేర్కొన్నారు. స్థానిక సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యాలయంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి విస్తృతస్థాయి  సమావేశం ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిర అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలలో సిపిఐ అగ్ర భాగాన ఉంటుందని ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా వెనుకబాటు తనానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలో రెండు నెలలపాటు కాక్రోచ్ ఉద్యమం ప్రధాని నరేంద్ర మోడీకి రెండు నెలలపాటు కంటిమీద కునుకు లేకుండా చేసి కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేసే వరకు పోరాడి విజయం సాధించిందన్నారు. డీ లిమిటేషన్, మహిళ రిజర్వేషన్ పేరుతో అమిత్ షా కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. దేశంలోని మీడియా సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ పేరుతో లక్షల ఓట్లు తొలగించి దొడ్డిదారిన అధికారంలోకి వస్తున్నారని మండిపడ్డారు.చట్టసభలలో ప్రాతినిధ్యం లభిస్తే ప్రజా సమస్యల పరిష్కారం మరింత చొరవ చూపే అవకాశం ఉంటుందన్నారు.తొలుత సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ ఇటీవల మరణించిన సిపిఐ నాయకులకు సంతాపం తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలు మౌనం పాటించాలి. ఈ సమావేశంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు కొల్లూరి సుధారాణి, గొర్లి స్వాతి, సాయన అభిలాష్ కుమార్, కొండేటి రాంబాబు, కొండేటి బేబీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, పుప్పాల కన్నబాబు, ఏరియా సమితి కౌన్సిల్ సభ్యులు బాలిన కృష్ణ ప్రసాద్, బళ్ల కనకదుర్గారావు, ఎస్ నాగలక్ష్మి, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవాని, నాగం అచ్యుత్, జిజ్జువరపు సురేంద్ర, కడుపు కన్నయ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *