నందికొట్కూర్’లో మీ ఆటలు సాగవ్
1 min read
వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోండి
21 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ..
నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల ఆటలు సాగవని వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వైసీపీ నాయకులకు సూచించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హెచ్ఏఎం) అభివృద్ధి పనుల్లో భాగంగా కుప్పం నుండి వర్చ్ గల్ (లైవ్)గా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రోడ్డులో ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నాయకులను ఫైర్ ఊర కుక్కల వ్యాఖ్యలతో పోల్చుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతుంటే వైసీపీ నేతలకు కనపడడం లేదన్నారు.నేను లోకల్ నాకు నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి తెలుసు నేను ఎమ్మెల్యే అయినప్పటికీ సామాన్య ప్రజలతో కలిసే తిరుగుతా వారితోనే కలిసి తింటా నేను ఇక్కడే పుట్టా..ఇక్కడే పెరిగా నేను ఇక్కడికి వలస రాలేదు.. వైసీపీకి చెందిన ఒక కొత్త వ్యక్తి టీడీపీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.నక్కను చూసి కుక్కలు వాతలు పెట్టుకున్నట్లు ఉంది వైసీపీ నాయకుల తీరు అని పేర్కొన్నారు.చిన్న పిల్లలను అడ్డుపెట్టుకొని డంప్ యార్డ్ రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.స్థానిక ఎన్నికల్లో వైసీపీ వారు నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పట్టణంలో వివిధ రకాల అభివృద్ధి పనులకు 21 కోట్లతో పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
టీడీపీ కార్యకర్తకు 5 లక్షల చెక్కు
పగిడ్యాల గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త గోదా దావీదు మృతి చెందడంతో తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా కింద ఐదు లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.పగిడ్యాల మండలంలో నలుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,వెంకటేశ్వర్లు యాదవ్, వీరం ప్రసాద్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ, సొసైటీ చైర్మన్ ముర్తు జావలి,లాయర్ జాకీర్ హుస్సేన్,మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ వనజ మరియు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు.



