అక్టోబర్ నెలలలో పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటునాం
1 min read
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి రాష్ట్ర జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతి నిధి,న్యూస్ నేడు: అక్టోబర్ నెలలలో జిల్లాలో 38 గ్రామాలలో 27 వేల 114 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 22ఏ భూ సమస్యల పరిష్కారం, రీ సర్వే, రెవిన్యూ సమస్యలు, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ అక్టోబర్ నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని, 22ఏ భూ సమస్యలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా నిబంధనల ననుసరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను నిర్దేశించిన లక్ష్యాల మేర పూర్తిచేయాలన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా అందిన దరఖాస్తులపై ధరఖాస్తుదారుని కలిసి సమస్య తెలుసుకుని నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో జిల్లాలో 32 గ్రామాలలో 13 వేల 131 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేశామని, అక్టోబర్ నెలలలో జిల్లాలో 38 గ్రామాలలో 27 వేల 114 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 22ఏ భూ సమస్యలపై జూన్, 15వ తేదీ నుండి ఈనెల 21వ తేదీ వరకు 480 దరఖాస్తులు అందగా వాటిలో 210 దరఖాస్తులు పరిష్కరించామని, నిబంధనల మేరకు లేని 193 దరఖాస్తులను కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామన్నారు. పెండింగ్ లో ఉన్న 77 దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో ధరఖాస్తుదారుని కలిసి సమస్య తెలుసుకుని నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ,ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి,నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న,ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న,రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.


