ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ గ్రామ సభ
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలో భాగంగా మండల పరిధిలోని నలకదొడ్డి గ్రామంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి,ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు,వాటి అమలు తీరుపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ గ్రామ సభలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బత్తిని రాజశేఖర్,రాజారెడ్డి, ఏపీవో వెంకటేశ్వర్లు,ఇంజనీర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్,ఫీల్డ్ అసిస్టెంట్, సామాజిక తనిఖీ ఆడిట్, సచివాలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శిదివ్య,ఉపాధిహామీమేటీలుపాల్గొన్నారు.అలాగే గ్రామానికి చెందిన ప్రజలు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపాధి హామీ పథకం పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామ సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.


