ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ముళ్లకంప తొలగింపు
1 min read
విద్యుత్ ప్రమాదాల నివారణకు లైన్‌మ్యాన్ హనీఫ్ చర్యలు
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద హొళగుంద గ్రామంలోని సినిమా రోడ్డు వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన ముళ్లకంపను విద్యుత్ శాఖ లైన్‌మ్యాన్ హనీఫ్ తొలగించారు. ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో ముళ్లకంప పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉండటంతో స్పందించిన లైన్‌మ్యాన్ హనీఫ్ ముళ్లకంపను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ట్రాన్స్ఫార్మర్ వద్ద ముళ్లకంపలు, చెట్లు పెరగకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విద్యుత్ సమస్యలపై వెంటనే స్పందిస్తున్న లైన్‌మ్యాన్ హనీఫ్‌ను స్థానికులు అభినందించారు.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ముళ్లకంపలు లేదా ఇతర సమస్యలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.


