గోరుకొల్లు లీకేజీ పరిశీలనకు వెళ్లిన సీపీఐ నేతలపై దాడి?
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: గోరుకొల్లు రిజర్వాయర్ లీకేజీని పరిశీలించేందుకు వెళ్లిన సీపీఐ నాయకులను అడ్డుకుని బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారని సీపీఐ మండల కార్యదర్శి మహేష్ ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిశీలించడం రాజకీయ పార్టీల హక్కు అని, నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు.ఈ ఘటనలో పాణ్యం సీఐ కిరణ్కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని, ఆరోపణలు నిజమని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ లీకేజీపై పూర్తిస్థాయి విచారణ జరిపి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని మహేష్ తెలిపారు.


