NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల అవసరాలను అనుగుణంగా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం

1 min read

:మాజీ ఎంపీపీ గోకుల్ లక్ష్మి

ఐదేళ్ల లో ప్యాపిలి మండలం అభివృద్ధి కి బాటలు

అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి పనులు

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల అభివృద్ధికి ఐదేళ్ల కాలంలో అన్ని వర్గాల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మాజీ ఎంపీపీ గోకుల్ లక్ష్మి, మాజీ జడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.బుధవారం ప్యాపిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు.

రైతుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి

వ్యవసాయ శాఖ అధికారి రాజేష్ మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన ప్రక్రియలను రైతులు పూర్తి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా జలదుర్గం గ్రామానికి చెందిన రైతు జమాల్ బాషా మాట్లాడుతూ పంట పొలాల్లో పిచికారీకి అవసరమైన యూరియా అందుబాటులో లేదని, కొంతమందికి మాత్రమే ఇస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎంపీపీ జోక్యం చేసుకుని పార్టీలకు అతీతంగా అర్హులైన రైతులందరికీ సమానంగా ఎరువులు, విత్తనాలు, రాయితీలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సీజనల్ వ్యాధులపై అవగాహన

వైద్య శాఖ అధికారి రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ప్యాపిలి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్య సేవలపై సభలో అవగాహన కల్పించినందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.

అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలను సభ్యులకు వివరించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ప్రజాప్రతినిధులు తమ గ్రామాలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోకుల్ లక్ష్మి మాట్లాడుతూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహకారంతో పాటు అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్యాపిలి మండల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు.

ఐదేళ్ల కాలంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశామని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు అందించిన సహకారం, ప్రజాప్రతినిధుల సమన్వయం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఐదేళ్లుగా తమకు అండగా నిలిచిన గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ ఎంపీపీ గోకుల్ లక్ష్మి ఎంపీటీసీ సభ్యులకు అధికారులు, సన్మానించారు.

మండల అభివృద్ధిలో భాగస్వాములైన ఎంపీటీసీ సభ్యులు, అధికారులు, సిబ్బంది మాజీ ఎంపీపీ గోకుల్ లక్ష్మి నిఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందించారు. ఐదేళ్ల కాలంలో మండల అభివృద్ధికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ పరస్పరం అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ రాజా రూపారాణి, మాజీ జడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి, డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్, పీఆర్ ఏఈ ప్రభాకర్ రెడ్డి, వైద్యాధికారి రాహుల్, ఏఓ శివకుమార్ గౌడ్, నాగేశ్వరరావు, హార్టికల్చర్ అధికారి కల్యాణి, ఏపీవో శ్రీవిద్య, ఐకేపీ కృష్ణమూర్తి, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మధుసూదన్, వార్డెన్ వెంకన్న గౌడ్, మధు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్వైజర్, విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర్లు నాయిక్, మహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *