NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండ

1 min read

33 మందికి రూ.17.10 లక్షల సీఎం సహాయనిధి పంపిణీ

ఆదోని, న్యూస్ టుడే:  పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నారు. ఆదోని నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు మంగళవారం ఆదోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ అందిస్తున్న సీఎం సహాయనిధిలో భాగంగా 33 మంది లబ్ధిదారులకు రూ.17,10,294 విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పేద ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఆపద సమయంలో అండగా నిలిచేలా సీఎం సహాయనిధిని అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆదోని నియోజకవర్గంలో 1064 మంది లబ్ధిదారులకు సుమారు రూ.3 కోట్ల మేర CMRF ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు.నియోజకవర్గంలో ఏ కుటుంబానికైనా అనారోగ్య సమస్య వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, వీలైనంత వరకు ప్రభుత్వ సహాయం అందేలా చేసి ప్రతి కుటుంబానికి అండగా నిలబడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిందే శంకర్, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, శ్రీనివాస్ ఆచారి, బాలాజీ, ఐసి రామకృష్ణ, సదుల్లా, అంజనమ్మ  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *