రేపు నూలి పురుగుల నివారణ దినోత్సవం
1 min read
19 సం.ల లోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు
డాక్టర్ రాజు,డాక్టర్ వ్యోమకేష్..
మిడుతూరు న్యూస్ నేడు: 25వ తేదీ రేపు శుక్రవారం జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విజయవంతం చేయాలని మిడుతూరు ఎంపీడీవో దశరథ రామయ్య మరియు కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పి రాజు,డాక్టర్ ఎం వ్యోమకేష్ బుధవారం అన్నారు. మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మరియు సీహెచ్ వో సురేష్ బాబు పోస్టర్లను ఆవిష్కరించారు.1 సం. నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఆరోగ్య సిబ్బంది వేయించడం జరుగుతుందని అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు,ఎంపీపీ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ రేపు మాత్రలు వేయడం జరుగుతుందని ఒకవేళ రేపు మాత్రలు వేసుకోకుండా మిస్ అయిన వారికి వచ్చే నెల అక్టోబర్ 5వ తేదీన మాత్రలు వేయడం జరుగుతుందని డాక్టర్ రాజు,డాక్టర్ వ్యోమకేష్ తెలిపారు. ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రేణుక,ఎంఎల్ హెచ్ పి మీనా,మారెమ్మ,ఏఎన్ఎం కళ్యాణి పాల్గొన్నారు.



