NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

25 లోగా బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోండి

1 min read

26న సెలవు..  27 న ఆదివారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పనిచేస్తాయి..

28, 29,30 న సమ్మె

కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్

కర్నూలు , న్యూస్ నేడు : యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, కర్నూలు జిల్లాలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా అన్ని బ్యాంకులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ పి. మోహన్ తెలిపారు.ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు సెప్టెంబర్ 27, 2026 ఆదివారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మరియు రీజినల్ రూరల్ బ్యాంకులు సాధారణ పనివేళల్లో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సెప్టెంబర్ 27న బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ATM-లింక్ శాఖలు మరియు కరెన్సీ చెక్కులు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది.అందువల్ల, సెప్టెంబర్ 26 నాల్గవ శనివారం సెలవు కాగా, సెప్టెంబర్ 27 ఆదివారం బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. అనంతరం సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో ప్రతిపాదిత బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో శాఖల ప్రత్యక్ష కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రజలకు అవసరమైన ముఖ్యమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా బ్యాంకులు తగిన SLBC మార్గదర్శకాలు మరియు Business Continuity Plan (BCP) అమలు చేయాలని సూచించారు.

బ్యాంకులకు ముందస్తు ఏర్పాట్లపై సూచనలు:

 NTR భరోసా పింఛన్లు: అక్టోబర్ నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల చెల్లింపులు అక్టోబర్ 1, 2026 నుండి ప్రారంభమయ్యే నేపథ్యంలో, సంబంధిత ప్రభుత్వ శాఖలు/పెన్షన్ పంపిణీ అధికారులతో బ్యాంకులు సమన్వయం చేసుకోవాలి. బ్యాంకు ఖాతాల్లో పింఛన్ మొత్తం జమయ్యే లబ్ధిదారులకు నగదు ఉపసంహరణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.

నగదు లభ్యత: ముఖ్యమైన శాఖలు, నగదు పంపిణీ కేంద్రాల్లో ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా తగినంత నగదు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

ATMలు మరియు CRMs: జిల్లాలోని ATMలు, Cash Recycler Machines (CRMs)లో తగినంత నగదు ఉండేలా ముందస్తు క్యాష్ లోడింగ్ మరియు రీప్లెనిష్మెంట్ ఏర్పాట్లు చేయాలి.

నిరంతర పర్యవేక్షణ: ATMలు/CRMsలో నగదు లభ్యతను నిరంతరం పర్యవేక్షించి, అవసరమైన చోట వెంటనే నగదు భర్తీ చేసే విధంగా contingency arrangements ఏర్పాటు చేయాలి.

డిజిటల్ బ్యాంకింగ్: Internet Banking, Mobile Banking, UPI తదితర డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా బ్యాంకులు అవసరమైన అంతర్గత ఏర్పాట్లు చేసుకోవాలి.ప్రభుత్వ చెల్లింపులు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు మరియు ఇతర ప్రభుత్వ ఆధారిత చెల్లింపుల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.

ప్రజలకు లీడ్ బ్యాంక్ మేనేజర్ సూచన:

కర్నూలు జిల్లా ప్రజలు సెప్టెంబర్ 25, 2026లోగా తమకు అవసరమైన ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *