NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైదరాబాద్‌లో బర్గర్‌ సింగ్‌ విస్తరణ

1 min read

రెండు ఔట్‌లెట్లు ప్రారంభం.. ఆరు నెలల్లో మరో 10

నగరంలో మొత్తం 12 స్టోర్లకు విస్తరణ ప్రణాళిక

హైదరాబాద్‌, న్యూస్​ నేడు: స్వదేశీ క్యూఎస్‌ఆర్‌ (క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌) చైన్‌ బర్గర్‌ సింగ్‌ హైదరాబాద్‌లో విస్తరణను వేగవంతం చేస్తోంది. కొండాపూర్‌, కోకాపేట్‌లో ఇటీవల రెండు ఔట్‌లెట్లను ప్రారంభించిన సంస్థ.. రాబోయే ఆరు నెలల్లో నగరవ్యాప్తంగా మరో 10 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. దీంతో హైదరాబాద్‌లో బర్గర్‌ సింగ్‌ ఔట్‌లెట్ల సంఖ్య 12కు చేరుకోనుంది. దక్షిణ భారతదేశంలో సంస్థ చేపడుతున్న విస్తరణ వ్యూహంలో హైదరాబాద్‌ కీలక మార్కెట్‌గా మారింది.జెన్‌-జెడ్‌ వినియోగదారులు, విద్యార్థులు, యువ ఉద్యోగులు అధికంగా ఉండటంతో హైదరాబాద్‌ను బర్గర్‌ సింగ్‌ కీలక వృద్ధి మార్కెట్‌గా పరిగణిస్తోంది. అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్‌ తరహా సౌకర్యంతో పాటు భారతీయ రుచులకు అనుగుణంగా త్వరగా, అందుబాటు ధరల్లో లభించే ఆహారానికి నగరంలో డిమాండ్‌ పెరుగుతోందని సంస్థ తెలిపింది.

రూ.30 లక్షల నుంచి పెట్టుబడి

కొత్త ఔట్‌లెట్ల ఏర్పాటులో భాగంగా నగరంలోని అధిక రద్దీ ఉండే వాణిజ్య, నివాస ప్రాంతాలను సంస్థ లక్ష్యంగా చేసుకోనుంది. కంపెనీ స్వయంగా నిర్వహించే స్టోర్లతో పాటు ఫ్రాంచైజీ విధానంలోనూ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో కొత్త ఔట్‌లెట్‌ ఏర్పాటుకు ప్రారంభ పెట్టుబడి సుమారు రూ.30 లక్షల నుంచి ఉంటుందని సంస్థ తెలిపింది.ఫ్రాంచైజీ మోడల్‌ ద్వారా నగరంలో వేగంగా విస్తరించడంతో పాటు స్థానిక వ్యాపారవేత్తలకు అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొంది. అధిక ఫుట్‌ఫాల్‌ ఉన్న ప్రాంతాలు, యువత ఎక్కువగా ఉండే వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. చేపడుతున్న తాజా విస్తరణ ద్వారా అధిక వృద్ధి అవకాశాలున్న మార్కెట్లలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో బర్గర్‌ సింగ్‌ ముందుకు సాగుతోంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *